Team India: సూర్యకుమార్ రాణించినా, మిగతా వాళ్లు విఫలం... భారీ స్కోరు సాధించలేకపోయిన భారత్

Team India set 166 runs target to WI
షార్ట్స్‌లో చూడండి
అమెరికాలోని లాడర్ హిల్ ప్రాంతంలో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. టీమిండియా, వెస్టిండీస్ మధ్య ఇవాళ చివరి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్ కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. 

16వ ఓవర్లో ఓసారి మ్యాచ్ నిలిచిపోవడానికి కారణమైన వర్షం, ఆఖరి ఓవర్లోనూ ప్రత్యక్షమైంది. మరో రెండు బంతులు వేస్తే టీమిండియా ఇన్నింగ్స్ ముగస్తుందనగా, మరోసారి వర్షం పడింది. అప్పటికి  భారత్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం సద్దుమణగడంతో ఇన్నింగ్స్ పూర్తయింది. 

టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే. సూర్యకుమార్ తన ఫామ్ కొనసాగిస్తూ 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. తెలుగుతేజం తిలక్ వర్మ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేశాడు. సంజు శాంసన్ 13, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 14, అక్షర్ పటేల్ 13 పరుగులు చేశారు. 

విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 4, అకీల్ హోసీన్ 2, జాసన్ హోల్డర్ 2, రోస్టన్ చేజ్ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Team India
West Indies
5th T20I
USA

More Telugu News