చేయూతలో జగన్ చేతివాటం ప్రదర్శిస్తున్నారు: గౌతు శిరీష
- సున్నా వడ్డీ పథకాన్ని తానే ప్రవేశపెట్టినట్టు జగన్ అసత్యాలు చెపుతున్నారన్న శిరీష
- సంక్షేమం గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శ
- స్త్రీనిధి పథకాన్ని నిలిపివేసింది జగనేనని ఆరోపణ
నాలుగేళ్ల పాలనలో డ్వాక్రాను జగన్ నాశనం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. డ్వాక్రాను తీసుకొచ్చి, మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచింది చంద్రబాబేనని చెప్పారు. అభయ హస్తం నిధులను కాజేసి... స్త్రీనిధి పథకాన్ని నిలిపివేసింది జగనేనని ఆరోపించారు.