బొలెరోలో వచ్చి పందులను ఎత్తుకెళ్లిన దొంగలు.. అనంతపురంలో వింత చోరీ
- అర్ధరాత్రి వచ్చి 30 పందులను ఎత్తుకెళ్లిన వైనం
- తెలిసిన వారి పనేనని గ్రామస్థుల అనుమానం
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాఫ్తు
పోలీసులు విచారణ చేపట్టి గ్రామ శివార్లలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు పందులను ఎత్తుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. దొడ్డిలోని 30 పందులను దొంగలు రోడ్డుపైకి తోలుకొచ్చి, బొలెరోలో ఎక్కించి తీసుకెళ్లారు. బొలెరో వాహనం నెంబర్ గుర్తించిన పోలీసులు.. ఆ నెంబర్ ఆధారంగా వాహనం యజమానిని, దొంగతనానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ దొంగతనానికి పాల్పడింది తెలిసిన వారే అయి ఉంటారని గ్రామస్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.