'జైలర్' బ్లాక్ బస్టర్ హిట్ .. థియేటర్స్ పెంచుతున్నాం: దిల్ రాజు
- ఈ రోజునే విడుదలైన 'జైలర్'
- తొలి ఆటతోనే హిట్ టాక్
- సక్సెస్ మీట్ ను నిర్వహించిన టీమ్
- ఆనందాన్ని వ్యక్తం చేసిన దిల్ రాజు
కొంతసేపటి క్రితం జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ .. "ఏసియన్ వారితో కలిసి ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇటు ఇండస్ట్రీ నుంచి, అటు జనాల నుంచి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే మాట వినిపిస్తోంది. థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆంధ్రాలో థియేటర్ల సంఖ్యను పెంచుతున్నాము" అని అన్నారు.
ఈ సినిమా చూసినవారు ఫస్టాఫ్ చాలా బాగుందనీ .. సెకండాఫ్ కాస్త స్లోగా సాగి .. ఆ తరువాత అందుకుందని అంటున్నారు. ఏదేమైనా రజనీకాంత్ గారికి చాలా కాలం తరువాత పెద్ద హిట్ పడింది. నంబర్స్ గురించి మండే తరువాత మాట్లాడదాం .. అప్పటివరకూ ఈ సినిమా సూపర్ హిట్ అనే విషయం గురించి మాత్రమే మాట్లాడుకుందాం" అంటూ ముగించారు.