ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్ కు కేజ్రీవాల్ లేఖ
- ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకించినందుకు ధన్యవాదాలు తెలిపిన కేజ్రీవాల్
- 2 కోట్ల ఢిల్లీ ప్రజల తరపున ధన్యవాదాలు చెపుతున్నానని వ్యాఖ్య
- రాజ్యాంగంపై మీ విధేయత దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని ప్రశంస
పార్లమెంటుకు బయట, లోపల ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడేందుకు మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పదని... మన రాజ్యాంగ సూత్రాల పట్ల మీకున్న అచంచలమైన విధేయత దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని అన్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.