రజనీకాంత్ సినిమా విడుదల రోజున కార్యాలయాలకు సెలవు

  • బెంగళూరు, చెన్నైలోని పలు సంస్థల నిర్ణయం
  • ఉద్యోగులకు ఉచితంగా జైలర్ సినిమా టికెట్లు
  • ఈ నెల 10న విడుదల కానున్న రజనీకాంత్ చిత్రం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండేళ్ల విరామం తర్వాత అభిమానులను ‘జైలర్’ రూపంలో అలరించబోతున్నారు. రజనీకాంత్ కు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అభిమానుల ఫాలోయింగ్ గణనీయంగా ఉంటుందని తెలిసిందే. ఈ నెల 10న జైలర్ విడుదల కానుంది. దీంతో ఇప్పటి నుంచే సందడి మొదలైంది. ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ సినిమా విడుదల రోజు ఉద్యోగుల హాజరు తక్కువగా ఉంటుందని భావించారో, ఏమో కానీ.. చెన్నై, బెంగళూరులో కొన్ని సంస్థలు తమ కార్యాలయాలకు 10వ తేదీన సెలవు ప్రకటించాయి. 

కొన్ని సంస్థలు అయితే జైలర్ సినిమా టికెట్లను తమ ఉద్యోగులకు ఉచితంగా బుక్ చేసి పెడుతున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా భాటియా నటించింది. గురువారం ప్రపంచవ్యాప్తంగా జైలర్ విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో సోషల్ మీడియాలో అభిమానుల సందడి, ఉద్వేగం కూడా పెరిగిపోతోంది. యూనో ఆక్వాకేర్ సంస్థ 10వ తేదీన సెలవు ప్రకటిస్తూ నోటీస్ ను జారీ చేసింది.

‘‘సూపర్ స్టార్ రజనీ మూవీ జైలర్ విడుదల సందర్భంగా, హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ ముందు సెలవుల కోసం అభ్యర్థనలు వెల్లువెత్తకుండా ఉండేందుకు 2023 ఆగస్ట్ 10న కార్యాలయానికి సెలవు ప్రకటిస్తున్నాం. పైరసీ నియంత్రణకు మద్దతుగా ఉద్యోగులకు ఉచితంగా టికెట్లను అందిస్తున్నాం’’ అంటూ నోటీసులో పేర్కొంది. మన తాత, మన తండ్రి, మన కుమారుడు, మన మనవడు అన్ని తరాలకు ఒకే ఒక సూపర్ స్టార్ అంటూ కొటేషన్ పెట్టేసింది.

Rajinikanth
Jailer Movie
release day
holiday declared

More Telugu News