పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం... రైలు పట్టాలు తప్పడంతో 25 మంది మృతి
- పట్టాలు తప్పిన హజారా ఎక్స్ ప్రెస్ లోని 10 బోగీలు
- కరాచీ నుంచి రావల్పిండి వెళుతున్న రైలు
- షహారా స్టేషన్ వద్ద ఘటన
షాజాద్ పూర్, నవాబ్ షా ప్రాంతాల మధ్య షహారా రైల్వే స్టేషన్ కు సమీపానికి రాగానే రైలు పట్టాలు తప్పింది. కాగా, పట్టాలు తప్పిన బోగీల్లో చాలామంది చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.