చరిత్ర సృష్టించిన తెలుగు ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ

  • ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ లో భారత్‌ కు తొలి స్వర్ణం అందించిన జ్యోతి సురేఖ జట్టు
  • కాంపౌండ్ మహిళల విభాగంలో విజేతగా భారత్
  • ఫైనల్లో మెక్సికో జట్టుపై ఘన విజయం
భారత ఆర్చరీ క్రీడా చరిత్రలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఏపీ అమ్మాయి జ్యోతి సురేఖ నేతృత్వంలో జట్టు భారత్ కు తొలి స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. బెర్లిన్‌లో నిన్న జరిగిన మహిళల కాంపౌండ్‌ జట్టు ఫైనల్లో జ్యోతి సురేఖ–అదితి స్వామి–పర్నీత్‌ కౌర్‌లతో కూడిన భారత్ 235–229తో డాఫ్నె క్వింటెరో–అనా సోఫియా హెర్నాండేజ్‌ జియోన్‌–అండ్రియా బెసెరాతో కూడిన మెక్సికో జట్టుపై సంచలన విజయం సాధించింది. 
.
దీంతో 1981 నుంచి ఈ టోర్నీలో ఆడుతున్న భారత్‌ కు తొలిసారి స్వర్ణ పతకం లభించింది. ఇదివరకు పోటీ పడ్డ 11 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్ 9 రజతాలు, 2 కాంస్యాలు సాధించింది. తాజా స్వర్ణంతో పతకాల సంఖ్య 12కి చేరింది. ఇందులో ఏడు తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సాధించినవే కావడం మరో విశేషం. ఈ రోజు జరిగే కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలోనూ జ్యోతి సురేఖ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.


More Telugu News