ఉగ్రవాదరహిత వాతావరణం ఉండాలి!: పాక్ ప్రధాని చర్చల మాటపై భారత్ స్పష్టీకరణ
- ఢిల్లీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
- పాకిస్థాన్ సహా పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు వెల్లడించిన భారత్
- భారత స్థిర, స్పష్టమైన వైఖరి అందరికీ తెలిసిందేనని వ్యాఖ్య
ఈ సంబంధాలు ఉగ్రవాదం, హింసకు తావులేని విధంగా ఉండాలన్నారు. ఈ సమస్యపై పాకిస్థాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన నివేదికలను చూశామని, పాకిస్థాన్ సహా మన పొరుగు దేశాలన్నింటితో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని, భారతదేశ స్పష్టమైన, స్థిరమైన వైఖరి అందరికీ తెలిసిందేనని అరిందమ్ పేర్కొన్నారు. హింస, శత్రుత్వం లేని వాతావరణం అవశ్యమన్నారు.