అధ్యక్ష ఎన్నికల ముంగిట చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్.. మరో కేసులో నేరాభియోగాల నమోదు
- గత ఎన్నికల్లో ఫలితాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న కేసులో ట్రంప్‌కు చుక్కెదురు
- ఆయనపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిన కోర్టు
- ఇప్పటికే రెండు తీవ్రమైన కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ట్రంప్
ఈ దాడి వెనుక ట్రంప్ హస్తం ఉందని స్పెషల్ కౌన్సిల్ భావించారు. ఇక, ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న అవాస్తవ ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకోవాలంటూ ట్రంప్ తమపై ఒత్తిడి తెచ్చారంటూ కొందరు అధికారులు వాంగ్మూలం కూడా ఇవ్వడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో గురువారం న్యాయస్థానం ఎదుట ట్రంప్ హాజరు కానున్నారు. కాగా, ట్రంప్ ఇప్పటికే రెండు తీవ్రమైన కేసుల్లో చిక్కుకున్నారు. ఓ శృంగార తారకు డబ్బులు చెల్లించిన కేసు, వైట్ హౌజ్ రహస్య పత్రాలను తరలించిన కేసులో ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి.