Team India: మూడో వన్డేలో గెలుపుతో బోల్డన్ని రికార్డులు బద్దలుగొట్టిన టీమిండియా

Team India Breaks Multiple Records Against West Indies
షార్ట్స్‌లో చూడండి
వెస్టిండీస్‌తో గత రాత్రి జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారీ విజయం సాధించిన భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. విండీస్‌పై భారత్‌కు ఇది రెండో అతపెద్ద విజయం. 2018లో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో 224 పరుగులతో గెలుపొందింది.

కరీబియన్ జట్టుపై భారత్‌కు ఇది వరుసగా 13వ సిరీస్ విజయం. 2007-23 మధ్య ఈ విజయాలు సాధించింది. భారత్ తర్వాత జింబాబ్వేపై పాకిస్థాన్ 1996-21 మధ్య వరుసగా 11 విజయాలతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలోనూ పాకిస్థానే ఉంది. విండీస్‌పై 1999-22 మధ్య వరుసగా 10 సిరీస్‌లను సొంతం చేసుకుంది. శ్రీలంకపై వరుసగా పది సిరీస్ విజయాలతో భారత జట్టు నాలుగో స్థానంలో ఉంది. 

ఓపెనర్లు ఇషాన్ కిషన్-శుభమన్ గిల్ కలిసి తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు. విండీస్‌పై భారత్‌కు ఇదే అత్యుత్తమ తొలి వికెట్ భాగస్వామ్యం. 2017లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధవన్-అజింక్య రహనే కలిసి 132 పరుగులు జోడించారు. ఇప్పుడా రికార్డును ఇషాన్ కిషన్-శుభమన్ గిల్ చెరిపేశారు.
Go Back to Shorts
Team India
West Indies
Ishan Kishan
Shubman Gill

More Telugu News