'స్కంద' నుంచి తమన్ హుషారైన బీట్!
- రామ్ హీరోగా రూపొందుతున్న 'స్కంద'
- ఆయన జోడీకట్టిన శ్రీలీల
- ప్రత్యేక ఆకర్షణగా తమన్ సంగీతం
- ఐదు భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'నీ చుట్టూ చుట్టూ ..' అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. కలర్ ఫుల్ గా వేసిన ఖరీదైన సెట్లో ఈ పాటను చిత్రీకరించారు. రామ్ ఎనర్జీకి తగినట్టుగా తమన్ కంపోజ్ చేసిన పాట ఇది అని అర్థమవుతోంది. యూత్ కి కనెక్ట్ అయ్యే మాదిరిగానే జోరుగా .. హుషారుగా ఈ బీట్ ఉంది.
పూర్తి పాటను ఈ నెల 3వ తేదీన ఉదయం 9:36 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చెప్పారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ ... కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. వరుస ఫ్లాపులతో ఉన్న రామ్ కి ఈ సినిమా హిట్ తెచ్చి పెడుతుందేమో చూడాలి.