హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి 15 చోట్ల ఈడీ దాడులు

ED raids in Hyderabad
  • హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడుల కలకలం
  • మాలినేని సాంబశివరావు నివాసంతో పాటు 15 చోట్ల దాడులు
  • జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్ట ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు
హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలను నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్ట ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి. 15 బృందాలుగా విడిపోయిన అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు నివాసం, కార్యాలయంతో పాటు పలువురి నివాసాల్లో సోదాలను నిర్వహిస్తున్నారు. 

కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రాటెక్, ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, ట్రాన్స్ ట్రై రోడ్ ప్రాజెక్టులకు మాలినేని సాంబశివరావు డైరెక్టర్ గా ఉన్నారు. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఈ సంస్థలు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
ED Raids
Hyderabad
Malineni Sambasiva Rao

More Telugu News