డబ్బు కోసం అతి తెలివి.. పేరోల్‌లో భార్య పేరును చేర్చి సంస్థను పదేళ్లపాటు మోసగించిన హెచ్ఆర్ మేనేజర్
- ఢిల్లీలోని మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వీస్ సంస్థలో ఘటన
- అసిస్టెంట్ మేనేజర్‌గా చేరి మేనేజర్ స్థాయికి ఎదిగిన నిందితుడు
- పదేళ్లపాటు దాదాపు రూ. 4 కోట్ల బదలాయింపు
- ఆ డబ్బుతో ఆస్తుల కొనుగోలు
నెలవారీ జీతాలకు సంబంధించి జాబితా సిద్ధమైన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తన భార్య పేరును చేర్చి హెచ్ఆర్ చీఫ్‌కు పంపేవాడు. అక్కడ అనుమతి పొందిన తర్వాత పేరోల్ వెండర్‌కు పంపేవాడు. ఇలా 2012 నుంచి అక్రమంగా దాదాపు రూ. 3.6 కోట్ల నగదును తన భార్య ఖాతాకు బదిలీ చేసినట్టు సంస్థ ఆరోపిస్తోంది.
ఆ సొమ్ముతో అతడు ఢిల్లీ, జైపూర్‌తోపాటు ఆయన స్వస్థలమైన ఒడిశాలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. మ్యూచువల్ ఫండ్స్‌లోనే భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సంస్థ ఆరోపించింది. ఉద్యోగి మోసాన్ని గుర్తించిన సంస్థ అతడిని నిరుడు డిసెంబరులో ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాలతో నిందితుడి నేరాలపై పూర్తిస్థాయి దర్యాప్తునకు పోలీసులు నడుం బిగించారు.