Ivana: 'LGM' నుంచి అత్తా కోడళ్ల పబ్ సాంగ్!

LGM movie song released
షార్ట్స్‌లో చూడండి
పెళ్లికి ముందు కాబోయే భార్యాభర్తలకి ఒకరి గురించి మరొకరికి ముందుగా తెలియాలనే ఒక కాన్సెప్ట్ తో ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చాయి. అలాగే అత్త గురించి కోడలికీ .. కోడలి గురించి అత్తకి ముందుగా తెలియాలనే ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే 'LGM'. సాక్షి సింగ్ ధోని నిర్మించిన ఈ సినిమాకి, రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించాడు. 

ఇవాన - హరీశ్ కల్యాణ్ జంటగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన తమిళంలో రిలీజ్ చేశారు. అదే రోజున తెలుగులోను విడుదల చేయాలని భావించారు. అయితే 'బ్రో' సినిమా కారణంగా వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఈ సినిమాను ఆగస్టు 4వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి 'టికి టికి టాటా' అనే పాటను రిలీజ్ చేశారు. 

కాబోయే అత్తా కోడళ్లుగా ఈ సినిమాలో నదియా - ఇవానా కనిపించనున్నారు. ఇద్దరి కాంబినేషన్ పై పబ్ లో చిత్రీకరించిన పాట ఇది. ఇక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుందన్నట్టుగా పాట నేపథ్యంలో ఏదో మతలబు జరుగుతున్నట్టుగా చూపించారు. కోలీవుడ్ లో ఓ మాదిరి టాక్ తో నడుస్తున్న ఈ సినిమా, ఇక్కడ ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి. 
Go Back to Shorts
Ivana
Nadiya
Harish Kalyan
LGM

More Telugu News