'మెగా ఈవెంట్'కి రెడీ అవుతున్న 'బేబి' టీమ్!
- ఈ నెల 14వ తేదీన విడుదలైన 'బేబి'
- 100 కోట్ల మార్క్ కి చేరువలో ఉన్న సినిమా
- సక్సెస్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేస్తున్న టీమ్
- మెగాస్టార్ చీఫ్ గెస్టుగా వచ్చే ఛాన్స్
అందువలన ఈ సినిమాపై ఎవరికీ కూడా పెద్దగా అంచనాలు లేవు. అందునా రిలీజ్ విషయంలో ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వచ్చింది. అలాంటి ఈ సినిమా చాలా ఫాస్టుగా యూత్ కి కనెక్ట్ అయింది. వారం తిరక్కముందే 50 కోట్ల మార్కును టచ్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు 100 కోట్లకి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దర్శక నిర్మాతలను మెగాస్టార్ అభినందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సాయిరాజేశ్ తాము మెగా ఈవెంట్ కి రెడీ అవుతున్నట్టు ఒక ట్వీట్ చేశాడు. మెగా ఈవెంట్ అని ఆయన పేర్కొనడం చూస్తే, విజయోత్సవంగా చెప్పుకునే ఈ వేడుకకి చిరంజీవి చీఫ్ గెస్టుగా రానున్నారనే విషయం అర్థమవుతోంది. త్వరలోనే ఈవెంటును గురించిన ఎనౌన్స్ మెంట్ రావొచ్చు.