నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఒడిశాలో 30వ తేదీ వరకు భారీ వర్షాలు
- నిన్న తీవ్ర పీడనంగా మారిన అల్పపీడనం
- 7.6 కిలోమీటర్ల ఎత్తున మరో తుపాను ఆవర్తనం
- తీరప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు
- మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరిక
దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే, తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.