కేటీఆర్‌‌కు ఇంగ్లండ్‌లో వినూత్నంగా బర్త్‌డే విషెస్!

mannem ranjit yadav birthday wishes to ktr
  • ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హమ్‌లో ఓ చాపర్‌ ద్వారా కేటీఆర్‌‌కు శుభాకాంక్షలు
  • తన అభిమానాన్ని చాటుకున్న బీఆర్‌ఎస్‌ నేత మన్నెం రంజిత్‌ యాదవ్‌
  • హైదరాబాద్‌లో భారీ బస్సుకు కేటీఆర్‌‌ విజయాలను వివరిస్తూ విష్ చేసిన అలిశెట్టి అరవింద్
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన్ను విష్ చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ నేత మన్నెం రంజిత్‌ యాదవ్‌ కేటీఆర్‌ పట్ల తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హమ్‌లో ఓ చాపర్‌ ద్వారా విష్ చేశారు. కేటీఆర్‌ పుట్టినరోజు ఫ్లెక్సీని వేలాడదీసి ఆకాశంలో ప్రదర్శించారు.

మరోవైపు బీఆర్ఎస్‌ నేత అలిశెట్టి అరవింద్.. భారీ బస్సుకు ఇరువైపులా మంత్రి కేటీఆర్ సాధించిన విజయాలను ఫొటోలతో వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టీ హబ్, దుర్గం చెరువు ఫ్లై ఓవర్, టీ వర్క్స్, నగరంలోని పలు ఫ్లైఓవర్ల చిత్రాలను ఇందులో పొందుపరిచారు. ఈ వాహనం నేటి నుంచి పది రోజులపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సంచరించనుంది.‌ తమ నేత ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు అలిశెట్టి పేర్కొన్నారు.


Go Back to Shorts
KTR Birthday
Birthday wishes
mannem ranjit yadav
BRS

More Telugu News