'బాహుబలి', 'ఎవరికి చెప్పొద్దు' ఫేమ్ రాకేశ్ వర్రే నిర్మాణంలో వస్తున్న 'పేకమేడలు' ఫస్ట్ లుక్

20-07-2023 Thu 13:21 | Entertainment
Advertisement
  • యువ నటుడు రాకేశ్ వర్రే తెరకెక్కించిన 'పేకమేడలు'
  • హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న వినోద్ కిషన్, అనూష కృష్ణ
  • టైటిల్ మాదిరే వైవిధ్య భరితంగా ఉన్న ఫస్ట్ లుక్
Advertisement
'బాహుబలి' చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేశ్ వర్రే. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో తానే కథానాయకుడిగా 'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమాను నిర్మించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే బ్యానర్ పై కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ 'పేకమేడలు' అనే చిత్రాన్ని రాకేశ్ వర్రే నిర్మించారు. ఈ సినిమా ద్వారా వినోద్ కిషన్, అనూష కృష్ణలు హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. 'నా పేరు శివ' తదితర చిత్రాల్లో వినోద్ కిషన్ కీలక పాత్రలను పోషించాడు. అనూషకు ఇదే తొలి చిత్రం. మరోవైపు ఈ చిత్రం ద్వారా నీలగిరి మామిళ్ళ అనే నూతన దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అవుతుండటం విశేషం. 

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ మాదిరే ఫస్ట్ లుక్, పోస్టర్ వైవిధ్యంగా ఉన్నాయి. హైదరాబాద్ బస్తీ, సిటీని కలగలిపిన 360 డిగ్రీలో ఉన్న ఫొటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చెనట్టుగా కథానాయకుడు వినోద్ కిషన్ ఉన్నాడు. లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని, సగం తొడుక్కున్న చొక్కాతో, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్నాడు. డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ సినిమాకు స్మరన్ సంగీతాన్ని అందించారు. ఒక యూనిక్ స్టోరీలైన్ తో పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.



Advertisement
PekamedaluFirst LookTollywood

More Telugu News

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27
..more