రేపు ప్రతిపక్ష కూటమి తొలి భేటీ!
- మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో జరగనున్న సమావేశం
- పార్లమెంట్‌లో చేపట్టాల్సిన అంశాలపై చర్చించేందుకు సమావేశం
- జులై 20 నుండి ఆగస్ట్11 వరకు పార్లమెంట్ సమావేశాలు
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలపై సమన్వయంతో వ్యవహరించాలని బెంగళూరులో జరిగిన సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. 26 పార్టీల I-N-D-I-A కి లోక్ సభలో 150 మంది ఎంపీల మద్దతు ఉండగా, ఎన్డీయేకు 330 మంది ఎంపీల మద్దతు ఉంది.