Viral video: రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్న పిల్లాడు.. మెడపై కాలువేసి తన్నుతూ ఆర్పీఎఫ్ పోలీసు దాష్టీకం.. వీడియో ఇదిగో!

RPF Police Caught on Camera Brutally Thrashing Child Sleeping At Railway Station In Ballia
షార్ట్స్‌లో చూడండి
మనసులు కదిలించే వీడియో ఇది. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగింది. రైల్వే స్టేషన్‌లో ఆదమరిచి నిద్రపోతున్న పిల్లాడి మెడపై కాలు వేసిన రైల్వే పోలీసు ఆపై తన్నుతూ వికృతంగా ప్రవర్తించాడు. అక్కడితో ఆగక అక్కడి నుంచి ఈడ్చి పడేశాడు. బల్లియాలోని బేల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. పోలీసు దాష్టీకాన్ని చాటుగా రికార్డుగా చేసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. అలా తిరుగుతూ చివరికి అధికారుల దృష్టిలో పడడంతో వారు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

పోలీసు తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు, ఇండియాకు మధ్యనున్న మరో తేడా ఇదేనని కొందరు కామెంట్ చేస్తే.. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని మరికొందరు అధికారులను కోరారు. అంత చిన్న పిల్లాడు ఏం చేశాడని అంత క్రూరంగా వ్యవహరించారని ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఇంతకుమించి ఊహించడం తప్పే అవుతుందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Viral video
Uttar Pradesh
Belthara Road Railway Station

More Telugu News