IMD: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన

IMD issues rain alert for AP and Telangana
షార్ట్స్‌లో చూడండి
వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో నైరుతి రుతుపవన ద్రోణి సాధారణ స్థితిలో కొనసాగుతోందని తెలిపింది. ఈ నెల 18 నాటికి వాయవ్య బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది. 

జులై 17 నుంచి 20 వరకు- తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు
జులై 18 నుంచి 20 వరకు- కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
జులై 16 నుంచి 20 వరకు- కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
జులై 16 నుంచి 17 వరకు- తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

కాగా, గడచిన 24 గంటల్లో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కొత్తపల్లెలో 11 సెంమీ, చెన్నూరులో 6 సెంమీ వర్షపాతం నమోదైంది.
Go Back to Shorts
IMD
Rains
Andhra Pradesh
Telangana
Weather
Forecast

More Telugu News