వీరుడంటే ఇతనే.. దాడి చేసిన చిరుతను బైక్ మీద బంధించి తీసుకెళ్లి ఫారెస్ట్ అధికారులకు ఇచ్చేశాడు.. వీడియో ఇదిగో!
- కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఘటన
- తనపై దాడికి ప్రయత్నించిన చిరుతతో పోరాడిన యువకుడు
- కాళ్లను తాడుతో బంధించి అటవీ అధికారులకు అప్పగించిన ధైర్యశాలి
తప్పించుకొని వెళ్తున్న దాన్ని బైక్‌తో వెంబడించి మరీ పట్టుకున్నాడు. తన దెబ్బకు స్పృహ కోల్పోయిన చిరుత నాలుగు కాళ్లను తాడుతో చుట్టి బంధించాడు. బెక్ వెనకాల వేసుకొని వెళ్లి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీశాఖ సిబ్బంది చిరుతకు చికిత్స చేయించారు. ఆ యువకుడు చిరుతను బైక్ పై కట్టి తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువకుడి ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు.