ఏపీలో దారుణం.. ఆస్తి కోసం పెదనాన్నను చంపేసిన వాలంటీర్
- కర్నూలు జిల్లా నూతనపల్లె గ్రామంలో ఘటన
- ఉమ్మడి కుటుంబానికి చెందిన 4 ఎకరాల భూమి గురించి గొడవ
- ఆస్తిని సమ భాగాలుగా పంచుకుందామన్న పెదనాన్నపై దాడి
దీంతో, మనం కూడా భూమిని రీసర్వే చేయించుకుని సమ భాగాలుగా పంచుకుందామని పెదనాన్న స్వామి (55) సూచించారు. దీనికి ప్రవీణ్ ఒప్పుకోకపోవడంతో... కుటుంబంలో గత మూడు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో తన సోదరుడు రాజశేఖర్ తో కలిసి పెదనాన్న, ఆయన కుమారుడు బాలస్వామిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో స్వామి చనిపోగా... బాలస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రవీణ్, రాజశేఖర్ తో పాటు వారి తల్లిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.