భార్య సినిమా నిర్మిద్దాం అనగానే ధోనీ రియాక్షన్ ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్య సినిమా నిర్మిద్దాం అనగానే ధోనీ రియాక్షన్ ఇదే!

This is the first reaction from dhoni when his wife asked him to make a film
  • ధోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ స్థాపించిన దిగ్గజ క్రికెటర్
  • మొదటి సినిమాగా ఎల్జీఎం నిర్మాణం
  • తమిళ్ తో పాటు తెలుగులో విడుదల కానున్న చిత్రం
భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆటగాడిగా, అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన మ‌హేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఈ మధ్యే చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. ధోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ ను స్థాపించి మొదటి సినిమాగా ఎల్జీఎం (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే సినిమాను రూపొందిస్తున్నాడు. 

త‌మిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. హ‌రీశ్ క‌ళ్యాణ్‌, ఇవానా జంటగా న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి తెరకెక్కించారు. ధోనీ భార్య సాక్షి, వికాస్ హ‌స్జా నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్రం ట్రైల‌ర్‌ను తాజాగా చెన్నైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ధోనీ దంపతులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. సినిమా చేద్దామని సాక్షి ప్రస్తావించినప్పుడు తమ మధ్య జరిగిన సంభాషణను వెల్లడించాడు. సినిమా చేయ‌టం అంటే ఓ ఇంటిని డిజైన్ చేసిన‌ంత సులువు కాదని అన్నానని తెలిపాడు. సాక్షి ఓ ఇంటీరియర్ డిజైనర్. ‘నువ్వు ఓ క‌థ‌ను ఫిక్స్ చేసుకుని, న‌టీన‌టులను కూడా ఎంపిక చేసుకో. ఒక్కసారి ఓకే అన్న‌ త‌ర్వాత సినిమా చేస్తాను’ అని చెప్పానని వెల్లడించాడు. అలా ఈ సినిమాను మొదలు పెట్టామని మంచి టీమ్ ఉండటంతో తక్కువ స‌మ‌యంలోనే  పూర్తి చేశామని తెలిపాడు. షూటింగ్ సమయంలో సినిమా యూనిట్‌కు మంచి ఆహారం ఉండేలా చూసుకోమ‌ని సాక్షికి చెప్పానన్నాడు.
Advertisement
MS Dhoni
sakshi dhoni
movie
LGM

More Telugu News