బీఆర్ఎస్ పార్టీలా కాదు.. మా పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు: మాణిక్ రావు ఠాక్రే
- ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మాణిక్ రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు
- చాలామంది సీఎం అభ్యర్థులు ఉన్నారని స్పష్టీకరణ
- తమ పార్టీ బీఆర్ఎస్ లా కాదని విమర్శ
తమ పార్టీలో ఒక్కరు కాదని.. చాలామంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క... ఇలా చాలామంది నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలా తమ పార్టీ కాదని, ఆ పార్టీలో కుటుంబంలోని వారే ముఖ్యమంత్రి అవుతారని విమర్శించారు. ఇంతమంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు.