కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షను నీరుగార్చేందుకే ఉచిత విద్యుత్ రాద్ధాంతం: రేవంత్
- రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామన్న రేవంత్
- బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని మరోసారి తేలిందని విమర్శ
- అన్ని మండలాల సబ్ స్టేషన్ల వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపు
బీఆర్ఎస్ 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తోందన్నారు. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను రూ.60 వేల కోట్ల అప్పుల్లో ముంచి, తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోసాలకు నిరసనగా రాష్టవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని సబ్ స్టేషన్ల వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.