రైలు ప్రయాణికులకు తీపి కబురు.. ఆ రైళ్లలో టికెట్ ధర 25 శాతం తగ్గింపు
- ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల ఛార్జీలు తగ్గింపు
- యాభై శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే రైళ్లలో అవకాశం
- రాయితీ తక్షణమే అమల్లోకి
సెలవులు, పండుగల సమయాల్లో నడిచే ప్రత్యేక రైళ్లలో ఈ పథకం వర్తించదని తెలిపింది. వనరులను గరిష్ఠ స్థాయిలో వినియోగించేందుకు వీలుగా ఏసీ కోచ్ లలో ప్రయాణాలపై డిస్కౌంట్ ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ రాయితీ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే, ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి చార్జీలు వాపస్ ఉండదని స్పష్టం చేసింది.