అమెరికా శ్వేతసౌధంలో దొరికిన కొకైన్
- వైట్ హౌజ్ వెస్ట్ వింగ్‌లో తెల్లటి ప్యాకెట్‌ను గుర్తించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు
- ప్రాథమిక పరీక్షల్లో కొకైన్ మాదక ద్రవ్యంగా గుర్తింపు
- ఆ సమయంలో వైట్ హౌజ్‌లో లేని జో బైడెన్
అందులోనూ అది కొకైన్ అని తేలినట్టు తెలుస్తోంది. దీన్ని అధికారులు నిర్థారించలేదు. అయితే ఆ పౌడర్ ఎలా వైట్‌హౌజ్ లోకి వచ్చిందన్న దానిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దర్యాప్తు చేస్తున్నారు. వైట్‌హౌజ్ వెస్ట్ వింగ్ అధ్యక్ష భవనానికి సమీపంలోనే ఉంటుంది. ఈ వెస్ట్ వింగ్ కు పలు పనుల కోసం రోజూ వందలాది మంది ప్రజలు వస్తుంటాయి. అయితే, వారిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే లోనికి పంపిసారు. మరి, ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌజ్ లోనికి కొకైన్ ప్యాకెట్ ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది.