రేపు మోదీతో భేటీ కానున్న జగన్.. కొన్ని అంశాల్లో జగన్ మద్దతును మోదీ కోరే అవకాశం!
- ఈ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరుతున్న జగన్
- మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్న ముఖ్యమంత్రి
- అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం
మరోవైపు కొన్ని అంశాల్లో జగన్ మద్దతును మోదీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఉమ్మడి పౌరస్మృతి వంటి వివాదాస్పద బిల్లులు కూడా ఉన్నాయి. ఈ బిల్లులు పాస్ కావాలంటే రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఈ బిల్లులకు సహకరించాల్సిందిగా జగన్ ను మోదీ కోరే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీతో ముఖ్యమంత్రి భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.