ఢిల్లీ మెట్రోలో తాను ఎందుకు ప్రయాణించిందీ వివరించిన ప్రధాని
- యువతతో కలసి ప్రయాణించడం ఆనందాన్ని ఇచ్చిందని వెల్లడి
- ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు
- ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని
యువకులైన స్నేహితులతో నేను కూడా డిల్లీ మెట్రోలో ముచ్చటించా. వారితో కలసి ప్రయాణించడం ఆనందంగా ఉంది" అన్నారు. ప్రధాని మెట్రో జర్నీ వీడియోని బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిల్ పై షేర్ చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శతాబ్దం పాటు ప్రతిభను, మేధోపరమైన వృద్ధిని ప్రోత్సహించింది. ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీకి శుభాకాంక్షలు’’ అని ప్రధాని పేర్కొన్నారు.