Old Man: టీనేజి అమ్మాయిపై వృద్ధుడి అత్యాచారం... కొడుకు అమర్చిన సీక్రెట్ కెమెరాకు చిక్కిన అఘాయిత్యం

Old man raped girl and the act was recorded in secret camera fixed by his son
  • ఢిల్లీలో పొరుగింటి బాలికపై కన్నేసిన 68 ఏళ్ల వృద్ధుడు
  • బాలికను మభ్యపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం
  • సీక్రెట్ కెమెరాలో రికార్డయిన వీడియో
  • వీడియోను బాలిక తండ్రికి పంపిన వృద్ధుడి కొడుకు
ఢిల్లీలో ఓ వృద్ధుడు పొరుగింటి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన అనూహ్య రీతిలో బయటికి వచ్చింది. 68 ఏళ్ల వృద్ధుడు, బాధిత బాలిక పక్క పక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. వృద్ధుడు తరచుగా బాలిక ఇంటికి వచ్చేవాడు. ఇరు కుటుంబాలు కలిసి అప్పుడప్పుడు ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతుండేవారు. 

ఒకరోజు, తన ఇంటి వెలుపల ఒంటరిగా ఉన్న బాలికను గుర్తించిన వృద్ధుడు ఆమెను మభ్యపెట్టి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆ అమ్మాయిని బెదిరించాడు. 

అయితే, ఈ అత్యాచార ఘటన ఓ సీక్రెట్ కెమెరాలో రికార్డయింది. ఈ సీక్రెట్ కెమెరా పెట్టింది ఎవరో కాదు... వృద్ధుడి కొడుకే. వృద్ధుడికి 40 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తండ్రి తీరు నచ్చకపోవడంతో, ఇరువురి మధ్య మాటల్లేవు. 

తండ్రి క్షుద్రపూజలు చేస్తున్నాడేమోనని అనుమానించిన ఆ కుమారుడు... తండ్రికి చెందిన గదిలో రహస్యంగా కెమెరా అమర్చాడు. ఇప్పుడా కెమెరాలోనే రేప్ ఘటన రికార్డయింది. అయితే, ఈ రేప్ వీడియో బాధిత బాలిక తండ్రికి చేరడంతో కుమార్తెను దీనిపై అడిగాడు. దాంతో ఆ బాలిక జరిగిందంతా చెప్పింది. 

తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. సెక్షన్ 376 (అత్యాచారం), సెక్షన్ 5×6 (నేరపూరితమైన బెదిరింపులు), సెక్షన్ 354 (మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా దాడి) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధుడ్ని అరెస్ట్ చేశారు. అంతేకాదు, అత్యాచార ఘటనను రికార్డ్ చేసి, దాన్ని బాధిత బాలిక తండ్రికి పంపిన కుమారుడి పైనా కేసు నమోదు చేశారు.
Old Man
Girl
Son
Video
Police
New Delhi

More Telugu News