అమాయకుల రక్తంతో తడిసిన పునాదులతో జగన్ సామ్రాజ్యం ఏర్పడింది: జవహర్

  • టీడీపీ పునాదుల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న జవహర్
  • సాక్షి టీవీ, సాక్షి పేపర్ కు భారతి యజమాని కాదా? అని ప్రశ్న
  • పత్రికా స్వేచ్ఛను కూడా జగన్ హరించారని విమర్శ
తెలుగుదేశం పార్టీ పునాదుల గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్ నేత జవహర్ అన్నారు. జగన్ కుటుంబం స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబమేమీ కాదని అన్నారు. అమాయకుల రక్తంతో తడిసిన పునాదులతో జగన్ సామ్రాజ్యం ఏర్పడిందని చెప్పారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ కు యజమాని భారతి కాదా అని ప్రశ్నించారు. 

అమ్మఒడిని ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే ఇస్తే... రెండో బిడ్డ పరిస్థితి ఏమిటని అడిగారు. సంక్షేమాన్ని పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీని విమర్శించడాన్ని జగన్ మానుకోవాలని చెప్పారు. పత్రికా స్వేచ్ఛను కూడా జగన్ హరించారని... జగన్ కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదని విమర్శించారు.


More Telugu News

Jawahar Telugudesam Jagan YSRCP