'కాంతార 2' సెట్స్ పైకి వెళ్లే సమయం దగ్గరికి వచ్చేసినట్టే!
- రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన 'కాంతార'
- భారీ వసూళ్లను రాబట్టిన సినిమా
- ప్రీక్వెల్ దిశగా జరుగుతున్న సన్నాహాలు
- ఆగస్టు 27వ తేదీ నుంచి షూటింగ్ మొదలు
ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడంతో 'కాంతార 2' పై రిషబ్ శెట్టి దృష్టి పెట్టాడు. అయితే ఈ కథ 'కాంతార' కథను ఎక్కడ ముగించారో అక్కడ నుంచి మొదలుకాదు, 'కాంతార' కథ మొదలు కావడానికి ముందు జరిగిన కథ ఇది .. అంటే ప్రీక్వెల్ అన్నమాట. గిరిజనులకు రాజు మాట ఇవ్వడానికి ముందు ఈ కథ మొదలవుతుంది.
ఇప్పటికే ఈ కథకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను రిషబ్ శెట్టి పూర్తిచేశాడు. ఆగస్టు 27వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఇక అసలు కథకు ముందు ఏం జరిగి ఉంటుందనే దాని కంటే, ఆ తరువాత ఏం జరిగి ఉంటుందనే విషయంపైనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందనేది అభిమానుల మాట.