పవన్ కల్యాణ్ కు జ్వరం... వారాహి యాత్రకు బ్రేక్
- ప్రస్తుతం భీమవరంలో ఉన్న పవన్ కల్యాణ్
- భీమవరంలోనే రెండ్రోజుల పాటు విశ్రాంతి
- ఈ నెల 30న భీమవరంలో జనసేన బహిరంగ సభ
పవన్ గత రాత్రి నరసాపురం సభ అనంతరం భీమవరం చేరుకున్న సంగతి తెలిసిందే. భీమవరంలో ఈ నెల 30న జనసేన బహిరంగ సభ నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ ఈ నెల 14 నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వారాహి విజయ యాత్ర చేపడుతున్నారు. తొలి విడత 11 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది.