ఆ విలేకరులు కొబ్బరిబోండాలు అమ్ముకుంటే మర్యాదగానైనా ఉంటుంది: వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
- ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై తప్పుడు రాతలు రాశారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం
- పచ్చ చానళ్లలో పనిచేసే విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్ల కంటే హీనమని వ్యాఖ్య
- ఓర్వలేకే ఇలాంటి రాతలు రాస్తున్నారంటూ దూషణ
రాయదుర్గంలోని ఆర్అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బొమ్మనహాల్ మండలం గౌనూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణపై మీడియా చానళ్లు, పత్రికలు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ ఆగ్రహంతో ఊగిపోయారు.
గ్రామస్థులు పత్తిపొలాల్లో పనులకు వెళ్లారని, వారొచ్చిన తర్వాత కలిసి ఫొటోలు తీయించుకున్నామంటూ ఇష్టమొచ్చినట్టు వార్తలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేకే ఇలాంటి వార్తలు రాస్తున్నారంటూ దూషించారు.