నకిలీ సంస్థల పేరిట బ్యాంకుకు కోట్లు టోపీ... 15 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్!
- నకిలీ సంస్థల పేరుతో బ్యాంకుకు టోపీ
- అమాయకుల పేరిట రుణాలు తీసుకున్న 10 మంది అరెస్ట్
- క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ తో ఐదుగురి మోసం
మరో ఘటనలో క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ పేరుతో మోసాలకు పాల్పడిన ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ నెంబర్ కోసం ఓ వ్యక్తి గూగుల్ లో వెతికాడు. ఈ క్రమంలో నకిలీ నెంబర్ ను గుర్తించలేక ఆ నెంబర్ కు ఫోన్ చేశాడు. కస్టమర్ కేర్ సిబ్బందిగా బాధుతుడ్ని నమ్మించిన సైబర్ నేరగాళ్లు అతని మొబైల్ లో ఎనీ డెస్క్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోమని సూచించారు. అనంతరం బాధితుడి క్రెడిట్ కార్డు నుండి రూ.16 వేలు తీసుకున్నారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరిపి ఢిల్లీలో నిందితుల్ని అరెస్ట్ చేశారు.