Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యార్థి అరాచకం.. మహిళా ప్రొఫెసర్‌ను నగ్నంగా వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్

student blackmails female professor with nude videos
Advertisement
  • మహారాష్ట్రలోని ఓ యూనివర్సిటీలో వెలుగు చూసిన ఘటన
  • మహిళా ప్రొఫెసర్‌తో తొలుత విద్యార్థి చాటింగ్
  • అనంతరం తమ సంభాషణ వివరాలు బయటపెడతానంటూ బెదిరింపులు 
  • బెదిరింపులకు లొంగిపోయిన బాధితురాలు, విద్యార్థి డిమాండ్ మేరకు నగ్నంగా వీడియో కాల్
  • ఈ వీడియోను ప్రొఫెసర్ భర్తకు పంపించి రూ.4 లక్షలు ఇవ్వాలంటూ నిందితుడి బ్లాక్‌మెయిల్
  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు
Advertisement
మహిళా ప్రొఫెసర్‌ను నగ్నంగా వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగిన విద్యార్థిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని ఓ యూనివర్సిటీలో ఈ ఘటన వెలుగు చూసింది. బీహార్‌కు చెందిన మయాంక్ సింగ్ అనే విద్యార్థి యూనివర్సిటీలోని ఓ మహిళ ప్రొఫెసర్‌తో తరచూ ఇన్‌స్టాగ్రాంలో చాటింగ్ చేసేవాడు. ఆ తరువాత నేరుగా ఫోన్, వాట్సాప్ కాల్‌ చేయడం మొదలెట్టాడు. 

ఇటీవల ఓ రోజు ఆమెకు వీడియో కాల్ చేసి తాను చెప్పినట్టు చేయకపోతే తమ చాటింగ్‌ తాలూకు స్క్రీన్ షాట్లను యూనివర్సిటీలో బయటపెడతానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో, భయపడిపోయిన మహిళా ప్రొఫెసర్ అతడు చెప్పినట్టు వీడియో కాల్‌లో నగ్నంగా మారింది. దీన్ని కూడా రికార్డు చేసిన నిందితుడు ఈ వీడియోను ఆమె భర్తకు పంపించి రూ. 4 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement
Mahara

More Telugu News