Anil Kumar Yadav: నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: అనిల్ కుమార్ యాదవ్
కొన్ని రోజుల పాటు తాను నెల్లూరులో లేకపోతే కొందరు పని కట్టుకుని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. వైసీపీకి దూరంగా ఉంటున్నానని కొన్ని పచ్చ పత్రికలు, మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊపిరి ఉన్నంత వరకు తాను జగన్ తోనే ఉంటానని చెప్పారు. ఎన్నికలకు మరో 9 నెలల సమయం ఉందని... ఇక నుంచి ప్రతి రోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు తాను అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు.