శ్రీరాముడు నీలం రంగులో కదా ఉండాలి: హీరో సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీరాముడు నీలం రంగులో కదా ఉండాలి: హీరో సుమన్

Adi Purush movie Update
  • 'ఆది పురుష్'పై స్పందించిన సుమన్ 
  • రాముడిని నీలం రంగులో చూపించలేదని విమర్శ 
  • రాముడి పాత్రకి మీసాలు పెట్టడం కరెక్టు కాదని వ్యాఖ్య 
  • రావణుడికి మోడ్రన్ హెయిర్ స్టైల్ పెట్టడం నచ్చలేదన్న సుమన్ 
  • హాలీవుడ్ షేడ్స్ చూపించారంటూ అసంతృప్తి
ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' చుట్టూ అనేక విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సినిమా చూసిన చాలామంది సినీ ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'శ్రీరామదాసు' సినిమాలో శ్రీరాముడిగా నటించిన సీనియర్ హీరో సుమన్ కూడా ఈ సినిమాను గురించి మాట్లాడారు. 

'ఆదిపురుష్' సినిమా చూశాను. బడ్జెట్ పరంగా ఇది చాలా పెద్ద సినిమా. 'రామాయణం' కథను మొత్తం చూపిస్తారనుకుని వచ్చిన ప్రేక్షకులు అసంతృప్తికి లోనయ్యారు. ఎందుకంటే సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్లడం .. శ్రీరాముడు ఆమెను తిరిగి తీసుకురావడం వరకే ఈ సినిమాలో చూపించారు. ఇక ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి శ్రీరాముడిగా నీలం రంగులోనే కనిపిస్తూ వచ్చారు. కానీ ఈ సినిమాలో చాలా సాదాగా చూపించారు" అని అన్నారు. 

రాముడిగా ప్రభాస్ చాలా బాగున్నాడు .. కానీ మీసాలు పెట్టారు. ఇంతవరకూ ఎక్కడా అలా చేయలేదు. శ్రీరాముడు మహా శాంతమూర్తి .. అలాంటి ఆయనతో ఫోర్స్ గా ఉండే డైలాగ్స్ చెప్పించారు. ఇక రావణుడికి మోడ్రన్ హెయిర్ స్టైల్ పెట్టారు. ఆయన పాత్రపై హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపించింది. సాంగ్స్ .. రీ రికార్డింగ్ నాకు బాగా నచ్చాయి. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కుదరలేదు" అంటూ చెప్పుకొచ్చారు.
Advertisement
Prabhas
Kruthi Sanon
Saif Alikhan
Adipurush

More Telugu News