Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పులిదాడిలో గాయపడిన గోవు.. పులిని తరిమికొట్టి రాత్రంతా దానికి రక్షణగా నిలిచిన మంద.. వీడియో ఇదిగో!

Herd Scares Tiger Away After It Attacks Cow On Bhopal
Advertisement
  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘటన
  • ఒంటరిగా ఉన్న ఆవుపై పులి దాడి
  • మంద వెళ్లడంతో పులి పరుగో పరుగు
Advertisement
రాత్రివేళ ఓ ఫామ్‌లో మందకు కాస్తంత దూరంలో నిద్రపోతున్న ఓ ఆవుపై పులి దాడిచేసి మెడ పట్టుకుంది. దీని అరుపులు విన్న మంద అటువైపు తిరిగి పులిని చూసింది. అంతే.. కలిసికట్టుగా అన్నీ వెళ్లి పులిని భయపెట్టాయి. తనపై దాడికి వచ్చిన మందను చూసిన పులి భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని కేర్వా ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది.

ఆవుల మంద దాడిచేయడంతో పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిన పులి తిరిగి దాడిచేసేందుకు సమయం కోసం దాదాపు మూడు గంటలపాటు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. పులి దాడిలో గాయపడిన ఆవు చుట్టూ చేరిన మిగతా ఆవులు ఆ రాత్రంతా దానికి రక్షణగా నిలిచాయి. ఉదయం గాయపడిన ఆవును చూసిన యజమాని దానిని ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం దాని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, 76 ఎకరాల్లో ఫామ్‌లో దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement
Cow
Bhopal
Cow Herd
Tiger

More Telugu News