జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
- 100 టవర్లను వర్చువల్ గా ప్రారంభించిన జగన్
- మూరుమూల ప్రాంతాల్లో 4జీ సేవలను అందించేందుకు వీలుగా టవర్ల ఏర్పాటు
- 209 గ్రామాలకు అందనున్న 4జీ సేవలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైఎస్సార్ జిల్లాలో 2 టవర్లను ప్రారంభించారు. ఈ టవర్ల ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయి. ఈ టవర్లను భవిష్యత్తులో 5జీ సేవలను అందించేందుకు జియో అప్ గ్రేడ్ చేయనుంది.