డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్

Producer KP Chowdary arrested in drugs case
  • కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
  • చౌదరి నుంచి కొకైన్ స్వాధీనం
  • ప్రస్తుతం గోవాలో ఉంటున్న చౌదరి
డ్రగ్స్ భూతం మరోసారి సినీ పరిశ్రమను షేక్ చేసింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన డగ్స్ వాడుతున్నట్టు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చౌదరి నుంచి కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ వాడుతున్న కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు. రజనీకాంత్ 'కబాలి' సినిమాకు కేపీ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు.
Advertisement
KP Chowdary
Tollywood
Drugs
Arrest

More Telugu News