ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్స్‌ను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం
- సీఐడీ కోర్టు ఆదేశాలతో రెండేళ్ల క్రితం జీజీహెచ్ లో జరిగిన వైద్య పరీక్షలు
- ఈ నివేదికలను ధ్వంసం చేయడానికి అనుమతి కోరిన అధికారులు
- ఈ నేపథ్యంలో తన వైద్య పరీక్షల రిపోర్ట్స్ భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని కోర్టుకెక్కిన ఎంపీ
కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, రేడియాలజీ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ను భద్రపరచాలని కోరారు. రెండేళ్లు పూర్తి కావడంతో ఈ నివేదికలను ధ్వంసం చేయడానికి అధికారులు ప్రభుత్వ అనుమతి కోరినట్లు రఘురామ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ కు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.