ర్యాపిడో, ఉబర్‌లకు సుప్రీం కోర్టులో షాక్
- టూవీలర్ సేవలను నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు
- హైకోర్టుకు వెళ్లిన ర్యాపిడో, ఉబర్ సంస్థలు
- సర్వీసులకు అనుమతించిన ఢిల్లీ హైకోర్టు
- సుప్రీం కోర్టుకు వెళ్లిన కేజ్రీవాల్ ప్రభుత్వం
- ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే
ర్యాపిడో, ఉబర్ లు మోటార్ వెహికిల్ యాక్ట్ 1988ను ఉల్లంఘిస్తున్నాయంటూ ఢిల్లీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో బైక్ - ట్యాక్సీ సేవలను నిషేధించింది. ద్విచక్ర వాహనాలేతర రవాణాపై తుది నిర్ణయాన్ని ప్రకటించే వరకు బైక్ - ట్యాక్సీ అగ్రిగేటర్లు, ర్యాపిడో, ఉబర్ లు తమ సేవలను నిలిపివేయాలని తెలిపింది.