'తెలంగాణ రన్'లో మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్.. వీడియో ఇదిగో!
- ఫిర్జాదిగూడలో తెలంగాణ రన్ కార్యక్రమం
- వేదికపై కాలు కదిపిన మంత్రి మల్లారెడ్డి
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
మరోపక్క, మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో నిర్వహించిన తెలంగాణ రన్ లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. వేదికపై ఆయన స్టెప్పులేసి కార్యక్రమంలో పాల్గొన్న వారిలో జోష్ నింపారు. వేదిక ఏదైనా సరే మంత్రి మల్లారెడ్డి ఉన్నారంటే ఉత్సాహం ఉప్పొంగాల్సిందేనని నిరూపించారు. మంత్రి డ్యాన్స్ తో అక్కడ ఉన్నవారు కూడా ఉత్సాహంగా కాలుకదిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.