అత్యంత కలుషిత దేశ రాజధానుల్లో ఢిల్లీకి రెండో స్థానం
- ప్రపంచంలోని వంద కాలుష్య నగరాల్లో 65 మనదేశంలోనివే
- టాప్20లో భారత్ లోని 14 ప్రాంతాలకు చోటు
- స్విట్జర్లాండ్ సంస్థ నివేదికలో షాకింగ్ విషయాలు
భారత్ లో అత్యధిక కాలుష్య నగరాలన్నీ ఉత్తర భారత్ లోనివే కావడం గమనార్హం. దేశంలోనే అత్యంత కలుషిత ప్రాంతంగా మహారాష్ట్రలోని భీవండి నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. అంతేకాదు అత్యంత కలుషిత దేశ రాజధానుల్లో ఢిల్లీ రెండో స్థానంలో నిలవడం శోచనీయం. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య ప్రాంతాల్లో 14 ప్రాంతాలు భారత్ లోనే ఉన్నాయి. ఈ జాబితాలో దర్భంగ, అసోపూర్, పట్నా, ఘజియాబాద్,, ముజఫర్‌నగర్, గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్ ఉన్నాయి.