తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు

Telangana weather forecast for three days
  • శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
  • సూర్యాపేట సహా పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం
  • శుక్రవారం నుండి శనివారం వరకు పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు
రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో పలుచోట్ల తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుండి శుక్రవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, కుమురం బీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

శుక్రవారం నుండి శనివారం ఉదయం వరకు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, కుమురం బీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఇక్కడ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ కేంద్రం.
Go Back to Shorts
rain
Telangana

More Telugu News