'పుష్ప 2'లో 'ఖైదీ' ఫేమ్ అర్జున్ దాస్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పుష్ప 2'లో 'ఖైదీ' ఫేమ్ అర్జున్ దాస్?

Pushpa 2 movie update
  • షూటింగు దశలో ఉన్న 'పుష్ప 2'
  • తాజాగా అర్జున్ దాస్ పేరు తెరపైకి
  • రౌడీ షీటర్ పాత్రలో కనిపిస్తాడని టాక్  
  • ఆయన బేస్ వాయిస్ కి పెద్ద సంఖ్యలో ఉన్న ఫ్యాన్స్
సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు చేసింది. దాంతో అంతకుమించి అన్నట్టుగా ఉండేలా ఆయన సీక్వెల్ ను చేస్తున్నారు. ఈ సినిమా కోసం వివిధ భాషల నుంచి మరికొంతమంది స్టార్స్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ జాబితాలో తాజాగా అర్జున్ దాస్ పేరు కూడా వినిపిస్తోంది. 

అర్జున్ దాస్ అనే పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కార్తి హీరోగా చేసిన 'ఖైదీ' సినిమా. ఆ సినిమాలో విలన్ గ్యాంగ్ లో ఒకడిగా ఆయన పండించిన విలనిజం సినిమా చూస్తున్న చాలామందిని టెన్షన్ పెట్టేసింది. సింపుల్ గా కనిపిస్తూనే సీరియస్ విలనిజాన్ని ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. 

ఇక విలన్ షేడ్స్ కలిగిన ఏ పాత్రను ఇచ్చినా ఆ పాత్ర మాత్రమే తెరపై కనిపించేలా చేస్తుంటాడు. ఆయన బేస్ వాయిస్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి అర్జున్ దాస్ ను ఒక రౌడీ షీటర్ పాత్ర కోసం సుకుమార్ ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. అర్జున్ దాస్ మార్క్ యాక్షన్ తోడైతే, ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.

Advertisement
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Arjundas

More Telugu News