అమెరికాలో తెలుగు ఎన్నారై దుర్మరణం..కుమారుడిని కాపాడుకునే ప్రయత్నంలో దుర్ఘటన
- కాలిఫోర్నియా పాంథర్ బీచ్లో గత సోమవారం వెలుగుచూసిన ఘటన
- సముద్రంలోకి వెళ్లి బయటకు రాలేకపోయిన శ్రీనివాసమూర్తి కుమారుడు
- తనకు ఈతరాకపోయినా కుమారుడి కోసం నీళ్లల్లోకి దిగిన శ్రీనివాసమూర్తి
- కొడుకును రక్షించాక అనుకోని ప్రమాదం
- పెద్ద అల రావడంతో సముద్రంలో మునిగిపోయిన ఎన్నారై
- అత్యవసర సిబ్బంది ఆయనను రక్షించి ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ ఎన్నారై మృతి
ఇది గమనించిన శ్రీనివాసమూర్తి తనకు ఈత రాకపోయినా నీళ్లల్లోకి దిగి కొడుకును కాపాడారు. ఇంతలో ఓ భారీ అల ఆయనను సముద్రంలోకి లాక్కెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. అత్యవసర సిబ్బంది ఆయనను బయటకు తీసుకొచ్చి స్థానిక ఆసుపత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసమూర్తి మరణించారు.